Vijayawada: నాడు అన్న క్యాంటీన్‌.. నేడు వ్యర్థాల కేంద్రం

ఆకలితో ఉన్న పేదల కడుపు నింపేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం వచ్చాక మూసివేసి.. ఇతర అవసరాలకు కార్యాలయాలుగా మార్చేసింది.

Updated : 29 Mar 2023 08:27 IST

ఆకలితో ఉన్న పేదల కడుపు నింపేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం వచ్చాక మూసివేసి.. ఇతర అవసరాలకు కార్యాలయాలుగా మార్చేసింది. విజయవాడలో రైల్వేస్టేషన్‌, బస్టాండ్లకు సమీపంలోని అలంకార్‌కూడలిలో ధర్నాచౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌కు నిత్యం వందల మంది నిరుపేదలు, నగరానికి వలస వచ్చిన కార్మికులు వచ్చి భోజనం చేసేవారు. మూసివేసిన ఈ అన్న క్యాంటీన్‌లో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మంగళవారం వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్లాస్టిక్‌, ఈ-వేస్ట్‌ను అందజేస్తే కంపోస్టు, క్లాత్‌ బ్యాగులను ఉచితంగా ఇస్తామని, పాతదుస్తులు, వస్తువులు సేకరించి పేదలకు అందిస్తామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని