20 నిమిషాలు స్తంభించిన తితిదే వర్చువల్‌ సేవా టికెట్ల సైట్‌

తిరుమల శ్రీవారి వర్చువల్‌ సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో మంగళవారం తితిదే విడుదల చేయగా.. కొంతసేపు సాంకేతిక సమస్య ఏర్పడి వెబ్‌సైట్‌ స్తంభించింది.

Updated : 29 Mar 2023 06:40 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి వర్చువల్‌ సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో మంగళవారం తితిదే విడుదల చేయగా.. కొంతసేపు సాంకేతిక సమస్య ఏర్పడి వెబ్‌సైట్‌ స్తంభించింది. ఏప్రిల్‌కు సంబంధించి ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, కల్యాణోత్సవం వర్చువల్‌ సేవాటికెట్లను ఆన్‌లైన్‌లో ఉదయం తితిదే విడుదల చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు టికెట్లను బుక్‌ చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో వెబ్‌సైట్‌లోకి ప్రవేశించడంతో సైట్‌ దాదాపు 20 నిమిషాలు స్తంభించింది. తితిదే ఈడీపీ సాంకేతిక విభాగం సైట్‌ను పునరుద్ధరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని