ఏపీలో బంగారు ఖనిజ నిల్వలు: కేంద్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు ప్రాంతాల్లో 11.549 మిలియన్ టన్నుల బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా ఉందని కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ తెలిపారు.
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు ప్రాంతాల్లో 11.549 మిలియన్ టన్నుల బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా ఉందని కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ తెలిపారు. మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ బంగారం అన్వేషణ చేపట్టి ఇంతమేరకు వనరులను గుర్తించినట్లు బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ఇవన్నీ జీ2 స్టేజ్‌లో ఉన్నాయన్నారు. ఇందులో అనంతపురం జిల్లా చెన్నబావి మైన్‌బ్లాక్‌లో 0.138 మిలియన్ టన్నులు, చిత్తూరు జిల్లా చిగరగుంటలోని అయిదు బ్లాకుల్లో 2.399 మిలియన్ టన్నులు, జొన్నగిరి ప్రాంతంలోని డోనా ఈస్ట్, డోనా టెంపుల్ బ్లాకుల్లో 9.012 మిలియన్ టన్నుల నిల్వలున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Crime News
కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి