రాజధానిలో సెంటు భూమి స్థలాలు మాకొద్దు

రాజధానిలో సెంటు భూమి స్థలాలొద్దని, తాము ఉన్న చోటే నివాసాలకు పట్టాలివ్వాలని మంగళగిరి గండాలయపేట వాసులు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేశారు.

Published : 28 May 2023 05:07 IST

మంగళగిరి గండాలయపేట వాసుల ధర్నా

మంగళగిరి, న్యూస్‌టుడే: రాజధానిలో సెంటు భూమి స్థలాలొద్దని, తాము ఉన్న చోటే నివాసాలకు పట్టాలివ్వాలని మంగళగిరి గండాలయపేట వాసులు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేశారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నాలుగు దశాబ్దాల క్రితమే గండాలయపేటలో ఇళ్లు నిర్మించుకున్నామని, వాటికే పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఊరికి దూరంగా పట్టాలిస్తే ఇళ్లు కట్టుకొనే స్తోమత తమకు లేదని, నిత్యం పనుల కోసం నగరానికి రావడానికి దారి ఖర్చులు భారంగా మారతాయని వాపోయారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్‌.ఎస్‌.చంగయ్య, తెదేపా నాయకులు వాకా మాధవరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని