నేడు గుంటూరులో వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం మెగా మేళా-2

గుంటూరులోని చుట్టుగుంటలో శుక్రవారం నిర్వహించే వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

Published : 02 Jun 2023 04:28 IST

ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేయనున్న సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: గుంటూరులోని చుట్టుగుంటలో శుక్రవారం నిర్వహించే వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. అక్కడ రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం కింద రూ.361.29 కోట్ల విలువగల 2,562 ట్రాక్టర్లు, 100 హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను ముఖ్యమంత్రి జగన్‌ ఈ సందర్భంగా పంపిణీ చేయనున్నారు. దీంతోపాటు రూ.125.48 కోట్ల రాయితీ మొత్తాన్ని రైతు సంఘాల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారని సీఎం కార్యాలయం ప్రకటించింది.


ట్రాక్టర్లతో నాలుగు రోజుల ముందుగానే రమ్మన్నారని రైతుల గగ్గోలు

ఈనాడు, గుంటూరు: ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం పంపిణీ చేయనున్న ట్రాక్టర్లలో రైతులు రెండు, మూడు నెలల క్రితం కొనుక్కొని వాడుకుంటున్నవి కూడా ఉన్నాయి. అధికారికంగా శుక్రవారం సీఎం జెండా ఊపి ఈ ట్రాక్టర్లను పంపిణీ చేసి రైతులకు రాయితీ నగదును వారి ఖాతాల్లో జమ చేస్తారు. తాము ఎప్పుడో తీసుకొని వాడుకుంటున్న వాహనాలను కూడా పథకం ప్రారంభోత్సవానికి తరలించడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం నాలుగు రోజులు ముందుగానే తమను గుంటూరుకు రమ్మని చెప్పి మిర్చియార్డులో ఉంచారని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ట్రాక్టర్లతో వచ్చిన రైతులు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని