Andhra News: రాజమహేంద్రవరంలో లేడీ సింగం.. తగ్గేదేలే!

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పర్యావరణ ఇంజినీరు (ఈఈ) సైదా, పారిశుద్ధ్య విభాగం సిబ్బందితో మార్కెట్‌కు వచ్చారు.

Updated : 04 Mar 2023 09:17 IST

ప్లాస్టిక్‌ వస్తువులను సీజ్‌ చేసి ట్రక్కులో తరలించేసిన అధికారిణి

సమయం : శుక్రవారం ఉదయం 10 గంటలు... 

ప్రాంతం : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన వాణిజ్య కేంద్రం ఎస్వీజీ మార్కెట్‌

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పర్యావరణ ఇంజినీరు (ఈఈ) సైదా, పారిశుద్ధ్య విభాగం సిబ్బందితో మార్కెట్‌కు వచ్చారు. ప్లాస్టిక్‌ గ్లాసులు, సంచిలు, ప్లేట్లు తదితర వస్తువులను విక్రయిస్తున్న దుకాణాలను జల్లెడ పట్టారు. రెండు, మూడు గంటల్లో దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు సీజ్‌ చేసేశారు. వెంటనే వాటిని ట్రక్కులో వేయించేసి అక్కడినుంచి తరలించేశారు. ఈ క్రమంలో నగరంలో ఉన్న పలు అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినా ఆమె వెరవలేదు. కార్పొరేషన్‌లో ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి చెప్పించినా, చివరకు విషయాన్ని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆఖరికి కొంతమంది నేతల అనుచరులు మార్కెట్‌కు వెళ్లి హడావుడి చేసినా ఎవర్నీ లెక్కచేయలేదు. ఒకేసారి భారీ స్థాయిలో ఇలా సరకు ఎప్పడూ స్వాధీనం చేసుకోలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుత చర్యతో అధికారిణి సైదా మాత్రం కచ్చితంగా నిషేధిత ప్లాస్టిక్‌ విక్రయాలకు అడ్డుకట్ట వేయగలమనే నమ్మకాన్ని నగరవాసులకు కలిగించారు. కేంద్రప్రభుత్వ పథకాల పర్యవేక్షణలో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈఈగా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే గుంటూరు నగరపాలక సంస్థ నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు.

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని