రిలయన్స్‌ పవర్‌ నష్టం రూ.292 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ పవర్‌ రూ.291.54 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.

Published : 29 Jan 2023 02:01 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ పవర్‌ రూ.291.54 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ రూ.97.22 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.1,858.93 కోట్ల నుంచి రూ.1,936.29 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.1,900.05 కోట్ల నుంచి రూ.2,126.33 కోట్లకు పెరిగాయి. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ రూ.178 కోట్ల అప్పును చెల్లించింది. రుణ-ఈక్విటీ నిష్పత్తి 2.03:1 గా ఉంది. నికర విలువ రూ.11,219 కోట్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 5,945 మెగావాట్ల నిర్వహణ పోర్ట్‌ఫోలియో చేతిలో ఉన్నట్లు పేర్కొంది.

ముఖ్య ఆర్థిక అధికారిగా పాల్‌ నియామకం: శనివారం ఏర్పాటు చేసిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో అశోక్‌ కుమార్‌ పాల్‌ను ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా నియమించారు. ఈ నెల 29 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. పాల్‌కు ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా 22 ఏళ్ల అనుభవం ఉంది. కంపెనీతో ఈయనకు గత అయిదేళ్లకుపైగా అనుబంధం ఉంది. రిలయన్స్‌ పవర్‌లో చేరడానికి ముందు ఈయన దీపక్‌ నైట్రేట్‌ లిమిటెడ్‌లో పని చేశారు. దీనికి ముందు శ్రింక్‌ ప్యాకేజింగ్‌ ప్రై.లి., రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లోనూ బాధ్యతలు నిర్వర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని