ఒడిశా రైలు ప్రమాద బాధితులకు రిలయన్స్‌ వితరణ

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు తోడ్పాటు అందించడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన దాతృత్వ విభాగం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది.

Updated : 06 Jun 2023 14:39 IST

దిల్లీ: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు తోడ్పాటు అందించడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన దాతృత్వ విభాగం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. వారికి ఆరు నెలల పాటు బియ్యం, గోధుమ పిండి, చక్కెర, పప్పులు, ఉప్పు, వంట నూనె తదితర సరకులను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి జియో, రిలయన్స్‌ రిటైల్‌ ద్వారా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాద స్థలిలో తమ సంస్థ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొన్నారని, ఆహారం, నీరు, దుప్పట్లు, మాస్కులు, గ్లౌజులు వంటివి అందించినట్లు తెలిపారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రకటించిన సాయమిదీ.

* రైలు ప్రమాద బాధితులకు సాయం అందించే అంబులెన్స్‌లకు జియో-బీపీ నెట్‌వర్క్‌ ద్వారా ఉచితంగా ఇంధనం సరఫరా.  

* గాయపడినవారికి ఉచిత వైద్యం, మందులు.

* విషాదంలో ఉన్న బాధితుల కుటుంబ సభ్యులను మానసిక తోడ్పాటును అందించేందుకు కౌన్సెలింగ్‌ సేవలు.

* వైకల్యం బారినపడినవారికి చక్రాల కుర్చీలు, కృత్రిమ అవయవాలు.

* బాధితులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ.

* కుటుంబంలో సంపాదనపరుడిని కోల్పోయిన మహిళలకు మైక్రోఫైనాన్స్‌, శిక్షణ.

* ఈ ప్రమాదంతో ప్రభావితమైన గ్రామీణులకు ఆవులు, గేదెలు, కోళ్లు, మేకల పంపిణీ.  

* కుటుంబంలో ఒకరికి ఉచిత మొబైల్‌ కనెక్టివిటీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు