ఈఎస్‌జీ రేటింగ్‌ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి

పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్‌జీ) రేటింగ్‌  ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు (పీడీసీఎస్‌ఎల్‌) సెబీ అనుమతి ఇచ్చింది.

Published : 30 Apr 2024 02:03 IST

దిల్లీ: పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్‌జీ) రేటింగ్‌  ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు (పీడీసీఎస్‌ఎల్‌) సెబీ అనుమతి ఇచ్చింది. ఈఎస్‌జీ రేటింగ్‌లు, స్కోర్‌లు సహా పలు రిస్క్‌ మానిటరింగ్‌ సొల్యూషన్లను అందిస్తున్న సంస్థలు దేశీయంగా కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఇక్రా గ్రూపు చేరింది. ‘సెబీ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీస్‌ నిబంధనల కింద కేటగిరి-1 ఈఎస్‌జీ రేటింగ్‌ ప్రొవైడర్‌గా (ఈఆర్‌పీ) ఇక్రాకు చెందిన పూర్తి అనుబంధ సంస్థ పీడీసీఎస్‌ఎల్‌ నమోదయ్యేందుకు సెబీ అనుమతి ఇచ్చింద’ని ఇక్రా తెలిపింది. ఈఆర్‌పీ రిజిస్ట్రేషన్‌ కోసం 2023 సెప్టెంబరులో పీడీసీఎస్‌ఎల్‌ దరఖాస్తు చేసుకుంది. గతవారం క్రిసిల్‌కు చెందిన క్రిసిల్‌ ఈఎస్‌జీ రేటింగ్‌ అండ్‌ అనలిటిక్స్‌కు కూడా ఇదే తరహా అనుమతులను సెబీ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని