Viveka Murder case: నిందితుల జాబితా నుంచి నా పేరు తొలగించండి: దస్తగిరి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల జాబితాలో నుంచి తన పేరును తొలగించాలని సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 14 Nov 2023 18:54 IST

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల జాబితాలో నుంచి తన పేరును తొలగించాలని సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌ దాఖలు చేశారు. తనను కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి గతంలో సీబీఐ దాఖలు చేసిన మొదటి ఛార్జ్‌షీట్‌లో తనను సాక్షిగా చేర్చిందని కోర్టుకు తెలిపారు. కాగా, దస్తగిరి పిటిషన్‌పై మిగతా నిందితులు అభ్యంతరం తెలిపారు. దస్తగిరి పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న దస్తగిరి.. అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు