Crime News: కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం...

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే కూతురి విషయంలో దారి తప్పాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడిగా మారి

Updated : 07 May 2022 20:18 IST

పాట్నా: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే కూతురి విషయంలో దారి తప్పాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడిగా మారి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించి, కొట్టి, అత్యాచారం చేసిన ఘటనను ఆ యువతి కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. తనకు న్యాయం చేయాలంటూ కోరింది. వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా  డీఎస్పీ షహియర్‌ అక్తార్ నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బీహార్‌ సమస్తిపుర్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి తన కూతురిపై అత్యాచారం చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అతడుఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన కూతురు (18) పై కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాధితురాలి తల్లిని నిందితుడి తండ్రి భయపెట్టడంతో ఆమె నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఈ దుశ్చర్యను బాధితురాలు రహస్య కెమెరాలో బంధించింది. సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి న్యాయం కోరడంతో సంచలనంగా మారింది. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని