Remdesivir: ఖాళీ రెమ్‌డెసివిర్‌ సీసాల్లో సెలైన్‌ నీళ్లు!

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల ఖాళీ సీసాలను సేకరించి, వాటిలో సెలైన్‌ వాటర్‌ నింపి అసలైన ఇంజక్షన్లుగా మార్చేస్తున్నాడో మత్తుమందు టెక్నీషియన్‌. వాటిని రెండు మెడికల్‌ దుకాణాల నిర్వాహకులకు

Published : 23 May 2021 08:30 IST

 అసలు ఇంజక్షన్లుగా విక్రయం

విజయవాడ, న్యూస్‌టుడే: రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల ఖాళీ సీసాలను సేకరించి, వాటిలో సెలైన్‌ వాటర్‌ నింపి అసలైన ఇంజక్షన్లుగా మార్చేస్తున్నాడో మత్తుమందు టెక్నీషియన్‌. వాటిని రెండు మెడికల్‌ దుకాణాల నిర్వాహకులకు అంటగట్టి, ఒక్కో ఇంజక్షన్‌ను రూ.20వేలకు విక్రయించాడు. టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ కె.వి.శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం... విజయవాడ దుర్గాపురం వాసి చోడవరపు కిషోర్‌(39) సూర్యారావుపేటలోని ఒక ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రిలో మత్తుమందు టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ రోగులకు వినియోగించిన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల ఖాళీ సీసాలను భద్రపరిచి, వాటిలో సెలైన్‌ వాటర్‌ నింపేవాడు. వాటినే అసలైన ఇంజక్షన్లుగా నమ్మించి డోర్నకల్‌ రోడ్డులోని కోన మెడికల్స్‌ నిర్వాహకుడు కటికపూడి సంపత్‌కుమార్‌, గోవిందరాజులు నాయుడు వీధిలోని జయశ్రీ మెడికల్స్‌ నిర్వాహకుడు పాలడుగుల వెంకట గిరీష్‌లకు విక్రయించాడు. గుంటూరుకు చెందిన ఓ కరోనా బాధితుడి బంధువులు వీరిని సంప్రదించగా.. ఇంజక్షన్లను ఒక్కోటి రూ.20వేల చొప్పున విక్రయించారు.గుంటూరు ఆసుపత్రి వైద్యులు వాటిని నకిలీగా గుర్తించారు. బాధితులు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆరు నకిలీ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని