Published : 28/11/2021 05:31 IST

కిరండూల్‌ మార్గంలో రైల్వే ట్రాక్‌ ధ్వంసం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం
పట్టాలు తప్పిన ఇనుప ఖనిజం గూడ్స్‌

మావోయిస్టుల దాడిలో దగ్ధమైన జేసీబీ

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: విశాఖపట్నం- జగదల్‌పూర్‌- కిరండూల్‌ రైల్వే మార్గంలో మావోయిస్టులు శుక్రవారం రాత్రి బీభత్సం సృష్టించారు. ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలోని జిర్కా అటవీ ప్రాంతంలో కమలూర్‌-భాన్సీ మధ్య రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఆ మార్గంలో బచేలి నుంచి విశాఖపట్నానికి ఇనుప ఖనిజం తరలిస్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతులకు నివాళిగా శనివారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ట్రాక్‌ను ధ్వంసం చేసి.. రైలు ఇంజిన్‌కు భారత్‌బంద్‌ బ్యానర్‌ కట్టారు. ట్రాక్‌ ధ్వంసంతో జగదల్‌పూర్‌- కిరండూల్‌ మధ్య  రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు.

సర్పంచి భర్త దారుణ హత్య..
ఇదే రాష్ట్రంలోని నారాయణపూర్‌ జిల్లా పర్సాగావ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కర్మరి గ్రామ సర్పంచి భర్త బిర్జూరామ్‌ను మావోయిస్టులు శుక్రవారం రాత్రి హత్య చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద ఆయన గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ పనులు నిలిపివేయాలని హెచ్చరిస్తున్న మావోయిస్టులు.. శుక్రవారం రాత్రి రోడ్డు పనుల వద్ద ఉన్న బిర్జూరామ్‌ను పట్టుకొని దారుణంగా నరికివేశారు. పనులకు వినియోగిస్తున్న జేసీబీని  పెట్రోలు పోసి తగలబెట్టారు

 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని