ముఖ్యమంత్రిపై అనుచిత పోస్టులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రాన్ని అనుచిత పద్ధతిలో వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేసిన ఆరుగురిని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించగా.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మరో ఇద్దరిపై సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 06 Feb 2022 05:15 IST

ఆరుగురి రిమాండ్‌.. మరో ఇద్దరిపై కేసులు

కారేపల్లి, సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రాన్ని అనుచిత పద్ధతిలో వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేసిన ఆరుగురిని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించగా.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మరో ఇద్దరిపై సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు అనుచిత వ్యాఖ్యను జోడించి కేసీఆర్‌ చిత్రాన్ని ఎడిట్‌ చేశాడు. దాన్ని ఖమ్మం రూరల్‌ మండలం గొల్లపాడుకు చెందిన పొన్నెకంటి సురేశ్‌.. కారేపల్లి మండలంలోని బొక్కలతండాకు చెందిన హట్కర్‌ రాంబాబుకు పంపాడు. ఆ చిత్రాన్ని రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన జనగంటి అర్జున్‌, మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం కొత్తపోచారానికి చెందిన కొండమీది కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఏలూరుగూడెం గ్రామ వాసి నేలమర్రి నారాయణ, పాతర్లపాడుకు చెందిన నాగేంద్రయ్యలు వివిధ గ్రూపుల్లో పోస్టు చేశారు. తెరాస కారేపల్లి మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్టు చేసిన వారందర్నీ పోలీసులు ఫోన్‌ నంబర్ల ఆధారంగా గుర్తించారు. వారిని అదుపులో తీసుకుని, కేసు నమోదు చేశారు. ఇల్లెందు కోర్టులో హాజరుపరిచి సబ్‌జైలుకు తరలించారు. కాగా, ట్విటర్‌లో జీ ్మ్త్య-్ట’౯్జiఃః్చ  పేరిట ఉన్న ఖాతాలో సీఎంను దూషిస్తూ పోస్టు పెట్టారని, ఫేస్‌బుక్‌లో అశోక్‌ అనే వ్యక్తి సీఎం, తెరాసను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెరాస నేతలు మీర్జా ఖలీల్‌బేగ్‌, షఫీ అహ్మద్‌లు వేర్వేరుగా చేసిన ఫిర్యాదుల మేరకు హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని