భూమి పోయిందని అలిగి నవ వధువు పుట్టింటికి.. అవమాన భారంతో భర్త ఆత్మహత్య

జాతీయ రహదారి కోసం జరిపిన భూసేకరణ నవ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. ఎకరం భూమి పోయిందని తెలిసి నవ వధువు అలిగి పుట్టింటికి వెళ్లిపోగా అవమాన భారంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా దామెర

Updated : 01 Mar 2022 07:25 IST

పారాణి ఆరకముందే పెళ్లింట విషాదం

దామెర, న్యూస్‌టుడే: జాతీయ రహదారి కోసం జరిపిన భూసేకరణ నవ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. ఎకరం భూమి పోయిందని తెలిసి నవ వధువు అలిగి పుట్టింటికి వెళ్లిపోగా అవమాన భారంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. దామెర ఏస్సై హరిప్రియ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గ్రామానికి చెందిన నల్లెల గౌరయ్య (35) అనే యువరైతుకు వారం కిందట భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లయింది. గౌరయ్యకు గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. నాగ్‌పూర్‌-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం జరిపిన భూసేకరణలో ఎకరం భూమి పోయింది. ఈ విషయం పెళ్లికి ముందు చెప్పలేదని మనస్తాపం చెందిన గౌరయ్య భార్య మూడురోజుల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. పెళ్లయి వారం కాకముందే ఇలా జరగటంతో మనస్తాపం చెందిన గౌరయ్య సోమవారం పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. దీంతో వారం రోజుల్లోనే పెళ్లింట విషాదం చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని