పంచలోహ విగ్రహాల దొంగల అరెస్టు

చోళరాజుల కాలం నాటి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని కలిగి ఉన్న ఇద్దరు నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి సీఐ రాజేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

Published : 26 Jun 2022 05:26 IST

రూ.50 లక్షల విలువైన విగ్రహాలతో పాటు
జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్ల స్వాధీనం

అద్దంకి, న్యూస్‌టుడే: చోళరాజుల కాలం నాటి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని కలిగి ఉన్న ఇద్దరు నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి సీఐ రాజేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి..  బల్లికురవ మండలం చెన్నుపల్లి గ్రామంలో క్రీ.శ.1300 సంవత్సరం నాటి పంచలోహ విగ్రహాలు అపహరణ గురైనట్లు గతేడాది ఆగస్టు 16న అద్దంకి వీఆర్వో దామా సురేంద్ర ఫిర్యాదు చేశారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన మెండు నటరత్న సంజయ్‌నాథ్‌ అలియాస్‌ నటరాజన్‌, బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన షేక్‌ కరీముల్లాలపై కేసు నమోదైంది. నాటినుంచి నిందితుల కోసం వెతుకుతుండగా తప్పించుకుని తిరుగుతున్నారు. శనివారం సాయంత్రం నిందితులిద్దరూ బల్లికురవలో జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు విక్రయించేందుకు వెళుతుండగా అద్దంకి భవానీకూడలి వద్ద వారిని గుర్తించి, సీఐ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. 2016లో పల్నాడు జిల్లా యడ్లపాడు ఆంజనేయస్వామి గుడిలో, 2017లో బల్లికురవ మండలం చెన్నుపల్లి గ్రామ శివారులోని ఆలయంలో విష్ణుమూర్తి, సత్యభామ పంచలోహ విగ్రహాలను అపహరించినట్లు అంగీకరించారు. నిందితుల్ని అరెస్టు చేసి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు