ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తాపడి 26 మంది మృతి

ఆలయంలో వేడుకకు హాజరై తిరిగి వస్తున్న గ్రామస్థులు పెను ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ అదుపు తప్పి చెరువులో బోల్తాపడడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ నగర సమీప భదానా గ్రామం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated : 02 Oct 2022 06:04 IST

కాన్పుర్‌ సమీపంలో ఘోర ప్రమాదం

కాన్పుర్‌: ఆలయంలో వేడుకకు హాజరై తిరిగి వస్తున్న గ్రామస్థులు పెను ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ అదుపు తప్పి చెరువులో బోల్తాపడడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ నగర సమీప భదానా గ్రామం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాలీలో 50 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఫతేపుర్‌లోని చంద్రికాదేవి ఆలయంలో చిన్నారికి నిర్వహించిన పుట్టెంట్రుకల కార్యక్రమానికి హాజరైన బంధు మిత్రులు ఘటంపుర్‌లోని ఇళ్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు