మహిళపై వాలంటీర్‌ లైంగిక వేధింపులు

మహిళను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్న గ్రామ వాలంటీర్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. వేధింపులపై ఈ నెల 8న బాధిత కుటుంబం ఏలూరు జిల్లా నూజివీడు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

Published : 25 Nov 2022 03:43 IST

నిందితుడి సస్పెన్షన్‌

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: మహిళను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్న గ్రామ వాలంటీర్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. వేధింపులపై ఈ నెల 8న బాధిత కుటుంబం ఏలూరు జిల్లా నూజివీడు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. ఎస్సై తలారి రామకృష్ణ కథనం ప్రకారం... నూజివీడు మండలం అన్నవరానికి చెందిన మహిళను వాలంటీరు పల్లిపాము నవీన్‌ లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలు మండల పరిషత్తు కార్యాలయ అధికారులకు ఫిర్యాదుచేయగా వారు పట్టించుకోలేదు. అనంతరం పోలీసులను ఆశ్రయించడంతో అదేరోజు నవీన్‌ను అరెస్టు చేశారు. నిందితుడు బెయిల్‌పై వచ్చి విధులకు హాజరవుతున్నాడు. ఈ విషయం గురువారం సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి కావడంతో ఎంపీడీవో జి.రాణి ఆగమేఘాలపై విచారణ నిర్వహించి నవీన్‌ను విధుల నుంచి తొలగించారు. ఘటనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ ఈ నెల 18న తనకు అందిందని, సచివాలయ కార్యదర్శితో విచారణ చేయించి చర్యలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts