మేజిస్ట్రేట్‌పై హత్యాయత్నం

విధుల్లో ఉన్న ఎస్‌డీజేఎం(సబ్‌ డివిజనల్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌)పై హత్యాయత్నం ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా కోర్టులో కలకలం రేపింది.

Published : 29 Nov 2022 02:55 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: విధుల్లో ఉన్న ఎస్‌డీజేఎం(సబ్‌ డివిజనల్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌)పై హత్యాయత్నం ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా కోర్టులో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రకారం... బ్రహ్మపుర ఎస్‌డీజేఎం ప్రజ్ఞా పరమిత ప్రతిహారి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో పాత బ్రహ్మపుర జమాదేవి వీధికి చెందిన భగవాన్‌ సాహు(51) న్యాయస్థానం లోపలకు వచ్చాడు. కాసేపు నిల్చున్న తర్వాత ఒక్కసారిగా ఎస్‌డీజేఎం వద్దకు దూసుకెళ్లి, ఆమె మెడపై చాకు ఉంచి చంపేస్తానని బెదిరించాడు. అప్రమత్తమైన ఓ న్యాయవాది, ఇతరులు అతడిని బంధించి, చాకు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బి.ఎన్‌.పూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ శరవణ వివేక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని