తెగిపడిన విద్యుత్తు తీగ

ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యుత్తు తీగలు తెగిపడిన సంఘటనలు వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో విద్యుత్తు తీగ తెగి కిందపడింది.

Published : 30 Nov 2022 06:15 IST

త్రుటిలో తప్పిన ప్రమాదం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యుత్తు తీగలు తెగిపడిన సంఘటనలు వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో విద్యుత్తు తీగ తెగి కిందపడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మంగళవారం ఉదయం పుట్టపర్తిలోని పోలీసు వసతి గృహాల వెనుక భాగంలో నివాసాల మధ్యనున్న సబ్‌స్టేషన్‌ ఉంచి సాయినగర్‌కు వెళుతున్న 11 కేవీ విద్యుత్తు తీగ స్తంభం కండక్టు నుంచి తెగి కింద పడింది. విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌తో సబ్‌స్టేషన్‌లో సరఫరా నిలిచి ప్రమాదం తప్పింది. విద్యుత్‌ సిబ్బంది వచ్చి మరమ్మతు చేశారు. ఉడుత తీగలపై వెళ్లడంతో ఒక తీగపై మరొకటి తగిలి ప్రమాదం జరిగిందని ఏఈ కోమల నాగవలి తెలిపారు.

రాయదుర్గంలో...

రాయదుర్గం పట్టణం: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని సెయింట్‌పాల్‌ పాఠశాల సమీపంలో మంగళవారం విద్యుత్తు తీగ తెగిపడింది. ప్రభుత్వ ఉన్నత, ఆదర్శ, ఇందిరాగాంధీ పాఠశాలల విద్యార్థులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చెట్ల మధ్య మంటలు చెలరేగి తీగ కిందికి పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని