Stealing Chocolate: చోరీ వీడియో వైరల్‌.. అవమానభారంతో యువతి ఆత్మహత్య!

ఓ మాల్‌లో తాను చేసిన చాక్లెట్‌ల చోరీ ఘటన వీడియో వైరల్‌ కావడంతో.. మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌ద్వార్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 01 Nov 2022 02:05 IST

కోల్‌కతా: ఓ మాల్‌లో తాను చేసిన చాక్లెట్‌ల చోరీ(Stealing) ఘటన వీడియో వైరల్‌ కావడంతో.. మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని అలీపూర్‌ద్వార్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోన్న యువతి సెప్టెంబరు 29న తన సోదరితో కలిసి స్థానికంగా ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే చాక్లెట్‌లు చోరీ చేసిందని ఆరోపిస్తూ అక్కడున్న సిబ్బంది.. ఆమె బయటకు వెళ్తుండగా పట్టుకున్నారు.

ఆ తర్వాత ఆమె చాక్లెట్లకయ్యే మొత్తాన్ని చెల్లించి, స్టోర్ యాజమాన్యానికి క్షమాపణలూ  చెప్పినట్లు ఆమె తండ్రి వెల్లడించారు. అయితే, మాల్‌లోని వ్యక్తులు ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే తీవ్ర అవమానభారంతో ఆమె ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు.. ఆ మాల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. వీడియో తీసి, వైరల్‌ చేసినవారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు