రూ.1.50కోట్ల విలువైన గంజాయి పట్టివేత

అల్లం బస్తాల మధ్యలో గంజాయి మూటలను తరలిస్తున్న ముఠాను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.50 కోట్ల విలువ చేసే

Published : 12 Jul 2021 01:18 IST

విజయనగరం రింగ్‌రోడ్డు : అల్లం బస్తాల మధ్యలో గంజాయి మూటలను తరలిస్తున్న ముఠాను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.50 కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బి.రాజకుమారి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. గజపతినగరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ వాహనాన్ని ఈ ఉదయం వై జంక్షన్‌ వద్ద పోలీసులు తనిఖీ చేయగా అందులో 3వేల కేజీల గంజాయి వెలుగు చూసింది. వ్యాన్‌ డ్రైవర్‌ సత్యభాన్‌సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. సిమిలిగూడ నుంచి ఉత్తరప్రదేశ్‌కు గంజాయి తరలిస్తున్నట్టు అంగీకరించాడు. దిల్లీ నుంచి కుర్చీలు సిమిలిగూడ తీసుకొచ్చానని, తిరుగు ప్రయాణంలో యజమాని వితన్‌ కుమార్ సూచనల మేరకు గంజాయి బస్తాలను తరలిస్తున్నట్టు చెప్పాడు. డ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో ఆగ్రాకు చెందిన అరవింద్‌కుమార్‌, కొరాపుట్‌కు చెందిన భరత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. గంజాయి లోడుతో వెళ్తున్న వాహనం వెనుకనే వీరిద్దరూ మరో గస్తీ వాహనంలో వెళుతున్నట్లు ఎస్పీ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని