Train: ఎమర్జెన్సీ బ్రేక్‌తో ఆగిన రైలు.. కుదుపునకు ఇద్దరు ప్రయాణికులు మృతి

వేగంగా వెళ్తోన్న రైలు అకస్మాత్తుగా ఆగడంతో ఆ కుదుపునకు రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లాలో చోటుచేసుకుంది. 

Published : 12 Nov 2023 04:03 IST

ధన్‌బాద్‌: వేగంగా వెళ్తోన్న రైలు అకస్మాత్తుగా ఆగడంతో ఆ కుదుపునకు రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లాలో చోటుచేసుకుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పర్సాబాద్‌ సమీపంలో పూరి నుంచి న్యూదిల్లీకి వెళ్తోన్న పురుషోత్తమ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రైలును ఆపేందుకు లోకో పైలట్‌ అత్యవసర బ్రేక్‌ వేశాడు. ఆ సమయంలో రైలు గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో రైలు భారీ కుదుపునకు గురైంది. ఆ కుదుపునకు రైలులోని ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. నాలుగు గంటల తర్వాత రైలును డీజిల్‌ ఇంజిన్‌ సాయంతో గోమా రైల్వే స్టేషన్‌కు తరలించామని, అక్కడ రైలుకు ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ను జత చేసి దిల్లీకి పంపించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు