logo

సాహిత్య సదస్సుపై దాడి ముమ్మాటికీ ఉన్మాద చర్యే

ఇటీవల వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 'లౌకిక విలువలు- సాహిత్యం' అనే సదస్సులో చొరబడి ఫాసిస్ట్ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పేర్కొన్నారు.

Updated : 30 Apr 2024 13:30 IST

ఎదులాపురం: ఇటీవల వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 'లౌకిక విలువలు- సాహిత్యం' అనే సదస్సులో చొరబడి ఫాసిస్ట్ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్లో ఆమె మాట్లాడారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్యం విలువలను ధ్వంసం చేస్తూ మతోన్మాదంతో, ఫాసిస్ట్ పాలనకు పాల్పడుతున్న భాజపాను తరిమికొట్టాలన్నారు. భాజపాను ఓడించాలంటే లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో  ఐఎఫ్‌టీయూ నాయకులు వెంకట్, నారాయణ, తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని