logo

పదవి విరమణ పొందిన ఎస్ఐకి ఘన సన్మానం

అదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందిన జీవీ రమణారెడ్డి, అతని సతీమణి విజయలను ఎస్పీ గౌష్ ఆలం పోలీస్ ముఖ్య కార్యాలయంలో శాలువాలు కప్పి, మిఠాయిలు తినిపించి, బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు.

Published : 30 Apr 2024 17:28 IST

ఎదులాపురం: అదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందిన జీవీ రమణారెడ్డి, అతని సతీమణి విజయలను ఎస్పీ గౌష్ ఆలం పోలీస్ ముఖ్య కార్యాలయంలో శాలువాలు కప్పి, మిఠాయిలు తినిపించి, బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనను పోలీసు వాహనంలో ఇంటికి సాగనంపుతూ సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 1985లో కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో సేవలందిస్తూ ఎస్సై స్థాయికి చేరిన అతనిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్రావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సభ్యులు చిందం దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని