logo

బైండోవర్ ఉల్లంఘన కేసుల్లో తాఖీదులు

బైండోవర్ ఉల్లంఘన కేసుల్లో నిందితులు రూ.ఒక లక్ష చొప్పున చెల్లించాలని మావల తహసీల్దార్ తాఖీదులు జారీ చేశారు.

Published : 30 Apr 2024 19:04 IST

ఎదులాపురం: బైండోవర్ ఉల్లంఘన కేసుల్లో నిందితులు రూ.ఒక లక్ష చొప్పున చెల్లించాలని మావల తహసీల్దార్ తాఖీదులు జారీ చేశారు. సుభాష్ నగర్‌కు చెందిన బాబా ఖాన్, వడ్డెర కాలానికి చెందిన సిండే కిషన్ లను మావల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో పోలీసులు గత ఆగస్టులో బైండోవర్ చేయించారు. అనంతరం వారు మళ్లీ అదే నేరం చేయటంతో ఎస్సై ఇచ్చిన నివేదిక మేరకు 10 రోజుల్లో రూ.లక్ష చెల్లించాలని, లేనట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తాఖీదులు జారీ చేశారు. మావల ఎస్సై విష్ణువర్ధన్ ఆ ఉత్తర్వులను నిందితులకి అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని