logo

జిల్లా అభివృద్ధే సీఎం రేవంత్‌రెడ్డి అభిమతం

ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిమతం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ కూడలిలో నిర్వహించిన కార్నర్‌ సమావేశంలో మాట్లాడారు

Published : 05 May 2024 02:40 IST

నేరడిగొండ: మాట్లాడుతున్న మంత్రి సీతక్క
నేరడిగొండ, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిమతం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ కూడలిలో నిర్వహించిన కార్నర్‌ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చెమట తుడుచుకునే రుమాలుపై జీఎస్టీ విధిస్తూ వీధి వ్యాపారుల, పేదల పొట్ట కొడుతూ సంపదను పెద్దలకు దోచిపెడుతుందని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆడె గజేందర్‌, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, అధికార ప్రతినిధి పసుల చంటి, బోథ్‌ బ్లాక్‌ అధ్యక్షుడు ప్రపుల్‌చందర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

తలమడుగు: జడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తలమడుగులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తలమడుగు పులాజీబాబా ధ్యానమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. సొనాల(బోథ్‌): నిర్మల్‌లో ఆదివారం నిర్వహించనున్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆడె గజేందర్‌ అన్నారు. సొనాలలో శనివారం ఏఐసీసీ విచార్‌ విభాగ్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ అరుణ్‌కుమార్‌తో కలిసి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.  

 గుడిహత్నూర్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే గ్రామ పంచాయతీలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు దౌలత్‌రావు అన్నారు. మచ్చాపూర్‌, డొంగ్రగావ్‌ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

 నార్నూర్‌ : మాజీ సర్పంచి గజానంద్‌నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మండంలోని నార్నూర్‌, రాజులగూడ, మాన్కాపూర్‌, గంగాపూర్‌ గోండ్‌గూడ, తండా, తాడిహత్నూర్‌, జామ్‌డా, గుంజాల గ్రామాల్లో తోటి నాయకులతో ప్రచారం చేశారు.  
ఆదిలాబాద్‌ అర్బన్‌: కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడే కార్యకర్తలను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి సీతక్క అన్నారు. పట్టణంలోని ప్రజాసేవాభవన్‌లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు మేకల మధుకర్‌, సంజయ్‌ కుమార్‌, డి.నాగేశ్వర్‌, డీఎస్పీ శర్మ, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సంతోష్‌ కుమార్‌, వెంకట్‌ కుమార్‌, షేక్‌ మునీర్‌, రవీందర్‌, ముజాహిద్‌, హుస్సేన్‌, నరేందర్‌, రాము, ఇమ్రాన్‌, భగవాండ్లు, ప్రశాంత్‌, కౌశిక్‌, మహ్మద్‌ సాబీర్‌, సద్దాం బిన్‌, నవీన్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  
ఉట్నూరు గ్రామీణం: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని టీపీసీసీ ఆదివాసీ రాష్ట్ర కన్వీనర్‌ నాగాపూర్‌ మాజీ సర్పంచి సునీల్‌ జాదవ్‌ కోరారు. నాగాపూర్‌, ఎక్స్‌రోడ్‌, శ్యాంనాయక్‌తండాల్లో ‘కాళ్లు మొక్కుతా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించండి’ అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  
ఇంద్రవెల్లి : కాంగ్రెస్‌ మండల శాఖ అధ్యక్షుడు ముకాడే ఉత్తం, నాయకులు ఇంద్రవెల్లిలో ప్రచారం నిర్వహించారు.
భీంపూర్‌: దనోర, వడూర్‌లలో కాంగ్రెస్‌ శ్రేణులు శనివారం ఇంటింటి ప్రచారం చేశాయి. మండల కన్వీనర్‌ అశోక్‌ పాల్గొన్నారు.  
ఆదిలాబాద్‌ అర్బన్‌: కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పట్టణంలోని దుర్గానగర్‌, శంకర్‌గుట్టలో ప్రచారం చేశారు.  
బోథ్‌: పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. బోథ్‌తో పాటు పొచ్చర, కౌఠ, సొనాలలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఆడె గజేందర్‌లతో కలిసి శనివారం రాత్రి ప్రచారం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని