logo

కారల్‌ మార్క్స్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

కారల్ మార్క్స్ ఆశయాలను నెరవేరిస్తేనే ఆయనకు నివాళులు అర్పించినట్లు అవుతుందని సీపీఎం, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు సూచించారు.

Updated : 05 May 2024 13:52 IST

ఎదులాపురం: కారల్ మార్క్స్ ఆశయాలను నెరవేరిస్తేనే ఆయనకు నివాళులు అర్పించినట్లు అవుతుందని సీపీఎం, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు సూచించారు. కార్మికుల కోసం, వారి సమస్యల పరిష్కారానికి పోరాడిన కారల్‌ మార్క్స్‌ మాటలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆదివారం కారల్‌ మార్క్స్ జయంతిని సుందరయ్య భవనంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు వేరువేరుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను పటిష్ఠంగా అమలు జరపడానికి తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. దోపిడి వ్యవస్థ నుంచి కార్మిక వ్యవస్థను కాపాడడానికి ఆయన మార్గదర్శకం చేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో కార్మికుల అండగా ఉంటూ ఉద్యమిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని