logo

చరవాణికి బానిసై విద్యార్థి ఆత్మహత్య

చరవాణికి బానిసైన తొమ్మిదో తరగతి విద్యార్థి (17) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం బోరిగాం గ్రామంలో చోటు చేసుకుంది.

Published : 10 May 2024 05:37 IST

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: చరవాణికి బానిసైన తొమ్మిదో తరగతి విద్యార్థి (17) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం బోరిగాం గ్రామంలో చోటు చేసుకుంది. సారంగాపూర్‌ ఎస్సై కె.చంద్రమోహన్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన దంపతులకు సంతానం లేకపోవడంతో ఎనిమిదేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని అనాథ ఆశ్రమం నుంచి తొమ్మిదేళ్ల వయసున్న బాలుడిని దత్తత తెచ్చుకున్నారు. స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో ఇటీవలే ఎనిమిదో తరగతి పూర్తి చేసుకున్నాడు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతుల కోసం కుమారుడికి చరవాణి కొనిచ్చారు. అప్పటి నుంచి బాలుడికి చరవాణితో అమితబంధం ఏర్పడింది. నిత్యం ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతూ చరవాణికి బానిసయ్యాడు. గమనించిన తండ్రి మూడు రోజుల క్రితం చరవాణి అతి వినియోగం మంచికాదని దాన్ని బాలుడి దగ్గర నుంచి తీసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి గురువారం ఇంట్లో ఉరేసుకున్నాడు. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడని దత్తత తెచ్చుకుంటే ఇలా చేశాడని తల్లిదండ్రుల రోదనలు స్థానికుల హృదయాలను కలిచివేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు