logo

ప్రత్యేక కేంద్రం.. శతశాతం లక్ష్యం

ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు వజ్రాయుధం. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు ఓటరు నమోదు శాతం పెంపునకు కళాజాత బృందాలతో ప్రదర్శనలు, 2కే రన్‌, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.

Published : 10 May 2024 05:47 IST

గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్‌ కేంద్రం (పాత చిత్రం)

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు వజ్రాయుధం. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు ఓటరు నమోదు శాతం పెంపునకు కళాజాత బృందాలతో ప్రదర్శనలు, 2కే రన్‌, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఓటు హక్కును బాధ్యతగా గుర్తించడానికి, ఎన్నికల సంఘం అధికారులు కొన్ని ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. మంచిర్యాల జిల్లాలో శతశాతం ఓటింగే లక్ష్యంగా మహిళ, యువత, దివ్యాంగుల ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు

ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలను శుభకార్యాలు జరిగినట్లు కాగితపు పూలు, బెలూన్స్‌, కొబ్బరి మట్టలతో ఆలంకరిస్తారు. అక్కడికి వచ్చే ఓటర్లకు గ్రీన్‌, రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతం పలికినట్టు ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతారు.

మహిళా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది అంతా అతివలే ఉంటారు. మరోచోట దివ్యాంగులు, ఇంకోచోట యువ ఉద్యోగులే ఎన్నికల విధులు నిర్వహించనుండటం వీటి ప్రత్యేకత.


మంచిర్యాల..

  • మహిళా పోలింగ్‌ కేంద్రాలు: దండేపల్లి జడ్పీఎస్‌ఎస్‌, అంకత్‌పల్లి ఎంపీపీఎస్‌, దొనబండ జడ్పీహెచ్‌ఎస్‌,  మంచిర్యాల గల్స్‌ హైస్కూల్‌, నస్పూరు ఆక్స్‌ఫర్డ్‌ హైస్కూల్‌లో ప్రత్యేక మహిళా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుకు ఎంపిక చేయగా,
  • దివ్యాంగులు: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల
  • ఆదర్శ: నస్పూరు ఎంపీయూపీఎస్‌, గుల్లకోట ఎంపీయూపీఎస్‌, ముల్కల్ల జడ్పీఎస్‌ఎస్‌, మంచిర్యాల కేంద్రీయ విద్యాలయం, నస్పూరు సింగరేణి హైస్కూల్‌
  • యువత: మంచిర్యాల జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాల  

చెన్నూరు..

  • సీఈఆర్‌ క్లబ్‌, ముదిగుంట జడ్పీఎస్‌ఎస్‌, భీమారం ఎంపీపీఎస్‌, కత్తెరశాల ఎంపీయూపీఎస్‌, కోటపల్లి జడ్పీఎస్‌ఎస్‌
  • ఎల్లక్కపేట
  • మైన్స్‌ ఒకేషనల్‌ ట్రెనింగ్‌ సెంటర్‌, శివ్వారం గ్రామ పంచాయతీ భవనం, పోలంపల్లి ఎంపీపీఎస్‌, అంగన్‌రాజ్‌పల్లి ఎంపీయూపీఎస్‌, మల్లంపేట్‌ జడ్పీఎ
  • లింగన్నపేట

బెల్లంపల్లి..

  • దేవాపూర్‌, తాళ్ల గురిజాల జడ్పీఎస్‌ఎస్‌, తాండూరులోని రాజీవ్‌నగర్‌ గ్రామపంచాయతీ భవనం, జన్కపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌
  • బెల్లంపల్లిలో బజార్‌ ఏరియా జడ్పీఎస్‌ఎస్‌
  • సోమగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం, తాండూరులో జడ్పీఎస్‌ఎస్‌, దుబ్బగూడెంలో ఎంపీయూపీఎస్‌, భీమిని ఎంపీపీఎస్‌, వేమనపల్లి ఎంపీపీఎస్‌
  • బెల్లంపల్లి జూనియర్‌ ప్రభుత్వ కళాశాల
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని