logo

ఎంపీగా గెలిచిన వారికి వసతులు బోలెడు

ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తోంది.

Updated : 10 May 2024 06:24 IST

చెన్నూరు, జైపూర్‌, న్యూస్‌టుడే: ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తోంది.

  • నెలకు రూ.లక్ష(అన్ని అలవెన్సులతో కలిపి) వేతనం లభిస్తోంది. పదవి అనంతరం రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు పింఛను వస్తుంది. 

  • ఏడాదికి 34 సార్లు ఎంపీతోపాటు, జీవిత భాగస్వామికి ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తారు. ఫస్ట్‌క్లాస్‌ ఏసీ కోచ్‌లో రైలు ప్రయాణం ఉచితం. రహదారి ప్రయాణానికి కిలోమీటరుకు రూ.16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. 
  • నియోజకవర్గ కార్యాలయ నిర్వహణ ఖర్చు నెలకు రూ.45 వేలు, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ.2 వేలు అదనంగా ఇస్తారు. ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఇతర అవసరాల నిమిత్తం ప్రతి మూడు నెలలకు రూ.75 వేలు అందిస్తారు.

  • ప్రథమ శ్రేణి అధికారుల కేంద్ర పౌర సేవల కింద కేంద్రం వైద్యారోగ్య పథకం ద్వారా ఆరోగ్య సేవలు పొందవచ్చు. పాథాలాజికల్‌ లాబొరేటరీ సౌకర్యం, ఈసీజీ, దంత, కంటి ఈఎన్‌టీ, చర్మ, ఆరోగ్య సేవలు ఉచితంగా పొందవచ్చు.
  • దిల్లీలో నివాస వసతి కల్పిస్తారు. మొదటిసారి గెలిచిన ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాలను కేటాయిస్తారు. దిల్లీలో బీకేఎస్‌ ప్లాట్‌ను కేటాయిస్తున్నారు. సీనియర్‌ ఎంపీలకు వ్యక్తిగత బంగ్లాను కేటాయిస్తారు. 50 వేల యూనిట్ల ఉచిత విద్యుత్తు వినియోగించుకోవచ్చు.
  • మూడు టెలిఫోన్లు పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. దిల్లీలోని ఇంటి వద్ద కార్యాలయంలో, రాష్ట్రంలోని నివాసం వద్ద తనకు ఇష్టమున్న చోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదిలో 50 వేల ఉచిత కాల్స్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా 3జీ ప్యాకేజీలో అదనంగా 1.50 లక్షల కాల్స్‌ మాట్లాడుకునే వీలుంటుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని