logo

బాధ్యతగా ఓటేద్దాం

ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. అప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది.

Updated : 10 May 2024 06:23 IST

దండేపల్లి, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. అప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా.. ఓటేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఒకటి, రెండు ఓట్లతోనే ఫలితాలే తారుమారైన సంఘటనలు ఉన్నప్పటికీ ఓటు వేయడాన్ని చాలా మంది బాధ్యతగా గుర్తించడం లేదు. ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించినప్పుడే మెజారిటీ ప్రజల నిర్ణయానికి అనుగుణంగా పాలకులను ఎన్నుకునే అవకాశం ఉంది.

అవగాహన కల్పిస్తూ

ఓటింగ్‌ శాతం పెంచేందుకు స్వయం సహాయక సంఘాలకు దండేపల్లిలో స్వీప్‌ నోడల్‌ అధికారి కిషన్‌ ఆధ్వర్యంలో అధికారులు అవగాహన కల్పిస్తున్న చిత్రమిది. జిల్లా వ్యాప్తంగా ఓటింగ్‌ శాతం పెంచేందుకు జిల్లా, మండల, గ్రామైక్య సంఘాలు, మహిళా సంఘాలతో  సమావేశాలు, తదితర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు

పెద్దపల్లి నియోజకవర్గంలో 66.4 శాతం అధికం

పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి 1962 నుంచి అంటే ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 17వ సారి ఈనెల 13న జరగనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఏనాడు 67 శాతానికి మించి పోలింగ్‌ శాతం నమోదు కాలేదు. తొలి ఎన్నికల్లో 55.42 శాతం ఓటింగ్‌ నమోదు కాగా..2014 ఎన్నికల్లో నమోదైన 66.44 శాతమే అధికం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని