logo

విజయం.. చిత్తూరు, విశాఖ సొంతం

పట్టణంలోని ఆర్‌పీబీఎస్‌ జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన 8వ సీనియర్‌ అంతర్‌జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఫైనల్స్‌ రసవత్తరంగా సాగింది. పురుషుల విభాగంలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల మధ్య రసవత్తర పోరు సాగింది.

Published : 03 Oct 2022 01:40 IST

జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

మహిళల విభాగంలో విజేతగా నిలిచిన విశాఖ క్రీడాకారులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆర్‌పీబీఎస్‌ జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన 8వ సీనియర్‌ అంతర్‌జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఫైనల్స్‌ రసవత్తరంగా సాగింది. పురుషుల విభాగంలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల మధ్య రసవత్తర పోరు సాగింది. ఈ క్రమంలో చిత్తూరు విజయకేతనం ఎగుర వేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. మహిళా విభాగంలో విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల మధ్య సాగిన పోరులో విశాఖపట్నం క్రీడాకారులు తమదైన క్రీడా నైపుణ్యాన్ని చాటి కప్‌ను గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో ప్రకాశం, విశాఖపట్నం, కృష్ణ జిల్లాలు, మహిళల విభాగంలో నెల్లూరు, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలు ద్వితీయ, తృతీయ, నాలుగో స్థానాల్లో నిలిచాయి. గెలుపొందిన క్రీడాకారులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ట్రోఫీని అందజేశారు. రాష్ట్ర బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు విజయశంకర్‌రెడ్డి, రావు వెంకటరావు, శాప్‌ డైరెక్టర్‌ వీరరాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, కార్యదర్శి బాలాజీతోపాటు పలువురు నేతలు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

* జాతీయ స్థాయి పురుషుల జట్టుకు ఎంపికైన క్రీడాకారులు.. కె.రూపేంద్ర (చిత్తూరు), కె.ఎల్‌.వి.సాయి సురేష్‌ (కర్నూలు), ఎస్‌.సాయికృష్ణ (కృష్ణా), షారూఖ్‌ఖాన్‌ (అనంతపురం), ఎ.శ్రీనివాస్‌ తేజ (చిత్తూరు), ఎస్‌.కె.నాగూర్‌మీరా (ప్రకాశం), డి.రమేష్‌ (విశాఖ), జి.హేమనాథ్‌ (విశాఖ), వి.ఎ.చంద్రశేఖర్‌ (చిత్తూరు), మురళిలను (ప్రకాశం) ఎంపిక చేశారు. అదనపు క్రీడాకారులుగా ఎస్‌.కె.బవద్దీన్‌, వసంత్‌కుమార్‌, వంశీ, ఎస్‌.కుమార్‌లను ఎంపిక చేశారు.

* జాతీయ స్థాయిలో మహిళా జట్టుకు కె.దేవిక (విశాఖ), రాధా సరస్వతి (విశాఖ), టి.ప్రేమలత (గుంటూరు), ఎం.స్వర్ణలత (చిత్తూరు), ఎం.శ్వేత (నెల్లూరు), సి.హెచ్‌.మధుమిత (నెల్లూరు), పి.శిరీషా (తూ.గో.జిల్లా) పీవీఎస్‌ఎస్‌ ఐశ్వర్య (విజయనగరం), వి.ఎస్‌.జానకి (ప.గో.జిల్లా), ఆర్‌.కావ్యశ్రీ (విశాఖ) ఎంపిక కాగా, అదనపు క్రీడాకారులుగా కె.తనూజ, ధనలక్ష్మి, పుష్పజ్యోతి, వర్షిణిలను ఎంపిక చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని