logo

ఖరీఫ్‌కు రూ.500 కోట్ల రుణం

వచ్చే ఖరీఫ్‌ కాలానికి రూ.500 కోట్ల మేర పంట రుణాలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అధికారులకు పిలుపునిచ్చారు.

Published : 01 Feb 2023 02:01 IST

హక్కుదార్లకు రుణ పత్రాన్ని అందిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌,
ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

పాడేరు, న్యూస్‌టుడే: వచ్చే ఖరీఫ్‌ కాలానికి రూ.500 కోట్ల మేర పంట రుణాలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అధికారులకు పిలుపునిచ్చారు. 2022-23 ఆర్థిక సంఘం రుణ ప్రణాళిక అమలుపై మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, చిన తరహా పరిశ్రమల ప్రోత్సాహక సంస్థ, వ్యవసాయ, డీఆర్‌డీఏ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణతో పాటు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా రబీకి రూ.447 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికి రూ.206 కోట్ల వరకు మంజూరు చేశారని మిగిలిన రూ.231 కోట్ల పంట రుణాలు త్వరితగతిన అందజేయాలన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులకు రుణాలందించాలని ఆయన బ్యాంకర్లను కోరారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అటవీహక్కు పత్రాలకు తొలిసారి రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా 23 మంది ఆర్‌వోఎఫ్‌ఆర్‌ హక్కుదార్లకు ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున ఆమె అందించారు. అందుతున్న రుణాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ బీమా పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. పీఎంఈజీపీ పథకంలో వ్యవస్థాపక అభివృద్ధిపై శిక్షణ పూర్తి చేసుకున్న 38 మంది ధ్రువ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూబీఐ ఆర్‌ఎం నటరాజన్‌, గ్రామీణ వికాస్‌ బ్యాంకు ఆర్‌ఎం ఉదయ్‌ కిరణ్‌, ఎల్‌డీఎం రవితేజ, మెప్మా పీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో జగన్నాథరాజు, డీసీసీబీ సీఈవో వర్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని