logo

చిమ్మచీకట్లో డోలీమోత

పాలకుల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు వంతెన నిర్మించాలని వేడుకున్నా, ఆమెకు పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదు.

Published : 03 May 2024 02:19 IST

అనారోగ్యంతో బాధపడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తను అర్ధరాత్రి డోలీపై మోసుకొస్తున్న స్థానికులు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: పాలకుల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు వంతెన నిర్మించాలని వేడుకున్నా, ఆమెకు పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదు. గ్రామానికి అంబులెన్స్‌ వచ్చే వీలులేక అర్ధరాత్రి చిమ్మచీకటిలో చరవాణి వెలుతురులో రోగిని డోలీమోతతో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. గూడెంకొత్తవీధి మండలం జర్రెల పంచాయతీ జె.కొత్తూరు గ్రామానికి సమీపంలో కాలువ ఉంది. ఈ కాలువపై వంతెన నిర్మించాలని పలుమార్లు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో వంతెన నిర్మాణం జరగలేదు. బుధవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త ముర్ల మణి(25)కి కడుపులో నొప్పి రావడంతో కుటుంబీకులు 108కు ఫోన్‌ చేశారు. వంతెన నిర్మాణం జరగకపోవడంతో కాలువ అవతలి వరకే అంబులెన్స్‌ వచ్చింది. ఆ సమయంలో స్థానికులు ఆమెను డోలీపై మోసుకుంటూ కాలువ దాటించి అంబులెన్స్‌ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని గ్రామానికి చెందిన పొత్తూరు విష్ణుమూర్తి తదితరులు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని