logo

జగన్‌ పాలనలో పరిశ్రమలు పోయాయ్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో  ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్నవి పోయాయని సినీ హీరో నారా రోహిత్‌ ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.

Updated : 05 May 2024 03:42 IST

మాట్లాడుతున్న రోహిత్‌, పక్కన దాడి రత్నాకర్‌

అనకాపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో  ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్నవి పోయాయని సినీ హీరో నారా రోహిత్‌ ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. పట్టణంలో శనివారం రాత్రి ఆయన రోడ్‌ షో నిర్వహించారు. పూడిమడక రహదారి నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన నాలుగురోడ్లు, వేల్పులవీధి, చింతావారి వీధి, వేగివీధి, అగ్గి మర్రిచెట్టు, దిబ్బవీధి, సంతోషిమాత కోవెల మీదుగా పరమేశ్వరి ఉద్యానం కూడలికి చేరుకుంది. ఇక్కడ నిర్వహించిన సమావేశానికి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడుతూ వైకాపా పాలనలో అరాచకాలు మినహా ఎక్కడా అభివృద్ధి లేదన్నారు. చంద్రబాబునాయుడుకు పదవులు కొత్త కాదన్నారు. సినిమాలలో ఎంతో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్‌ ప్రజల కోసం జనంలోకి వచ్చారన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఎంపీగా సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణను గెలిపించాలన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, పొలిమేర నాయుడు, వైకాపా నాయకులు కాండ్రేగుల శ్రీరామ్‌, త్రివేణి, కాండ్రేగుల జోగేంద్ర పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని