logo

పోలింగు కేంద్రాల్లో సమస్యలుంటే చెప్పండి

ఎన్నికల విధులు నిర్వహించన్ను అధికారులు, సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై పూర్తిస్తాయిలో శిక్షణ తీసుకుని అవగాహన కలిగి ఉండాలని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 05 May 2024 01:38 IST

మాట్లాడుతున్న ఆర్వో ప్రశాంత్‌కుమార్‌

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఎన్నికల విధులు నిర్వహించన్ను అధికారులు, సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై పూర్తిస్తాయిలో శిక్షణ తీసుకుని అవగాహన కలిగి ఉండాలని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం పాడేరు నియోజకవర్గం నుంచి వచ్చిన పీవోలు, ఏపీవోలకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్వో ప్రశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో 399 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాలలో సమస్యలుంటే వెంçËనే సెక్టారల్‌ అధికారులకు తెలపాలన్నారు. తహసీల్దార్లు ఏవీ రమణ, సత్యనారాయణ, డీటీలు శివ, రాజు, శ్రీధర్‌, స్వామి, మాస్టర్‌ ట్రైనీలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని