logo

నీటి విడుదల నిలిపేసి గాలింపు

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రానికి చెందిన జోలాపుట్‌ జలాశయం నుంచి ఆదివారం కొన్ని గంటలపాటు నీటి విడుదల నిలిపివేశారు.

Published : 06 May 2024 01:37 IST

యువకుడి మృతదేహం గుర్తింపు

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రానికి చెందిన జోలాపుట్‌ జలాశయం నుంచి ఆదివారం కొన్ని గంటలపాటు నీటి విడుదల నిలిపివేశారు. జోలాపుట్ జలాశయం దిగువన ఉన్న ఒడిశాలోని బంగురుపడాకు చెందిన యువకుడు ఉద్దవ్‌ కోరా శనివారం నాటు పడవ మునిగి గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ గుర్తించడం కోసం నీటి విడుదల నిలిపేయాలని గ్రామస్థులు ప్రాజెక్టు వర్గాలను కోరారు. దీనికి స్పందించిన ప్రాజెక్టు వర్గాలు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. లమతపుట్‌ అగ్నిమాపక, ఒడిశా విపత్తు సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా.. ఆదివారం మధ్యాహ్నానికి మృతదేహం గుర్తించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నీటి విడుదల పునరుద్ధరించారు. నీటి విడుదల నిలిపివేయడంతో  విద్యుదుత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగలేదని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని