logo

యువత భవిత పట్టని పాలకులు: వడ్డే

స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, ముఖ్యంగా మనం ఎన్నుకున్న నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని ‘భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక’ రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.

Published : 06 May 2024 01:40 IST

సదస్సులో మాట్లాడుతున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, ముఖ్యంగా మనం ఎన్నుకున్న నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని ‘భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక’ రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. రంపచోడవరంలో ఆదివారం ‘భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి’ సదస్సును గిరిజన సంఘం అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో యువతరం భవిష్యత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం దృష్టి సారించలేదన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధపడటం దారుణమన్నారు. రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తున్నా వీటిని అడ్డుకోవడంలో వైకాపా, తెదేపా ఎంపీలు విఫలమయ్యారన్నారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి జాన్సీ, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, పరిరక్షణ వేదిక ప్రతినిధి బండ్ల శ్రీనివాస్‌, ఏడబ్ల్యూయూ రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, వ్యవసాయ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్‌, సంస్థ కోకన్వీనర్‌ విజయరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని