logo

సెల్‌ఫోన్‌ పేలి చిరు వ్యాపారికి గాయాలు

సెల్‌ఫోన్‌ పేలి వ్యక్తికి గాయాలు పాలైన ఘటన పెదబయలు మండలం బొంగరం పంచాయతీ పరమలమ్మలో చోటు చేసుకుంది.

Published : 06 May 2024 01:55 IST

గాయాలతో గోమంగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దబ్బాయి 

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్‌ పేలి వ్యక్తికి గాయాలు పాలైన ఘటన పెదబయలు మండలం బొంగరం పంచాయతీ పరమలమ్మలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం చిరు వ్యాపారి జడ్డి పెద్దబ్బాయి(56) ఇంటికి వస్తుండగా ప్యాంటు జేబులో ఉన్న ఫోన్‌ వేడెక్కి పేలింది. దీంతో తొడ ప్రాంతంలో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతునికి గోమంగి ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. వినియోగదారులు ఫోన్‌ వినియోగించినప్పుడు జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచించారు.

పేలిన సెల్‌ఫోన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని