logo

ఓటుతో వైకాపాకు బుద్ధి చెప్పండి: ఈశ్వరి

మీకు ఏ కష్టమొచ్చినా అండగా నేనుంటా.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. దీనికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటుతోనే వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు.

Published : 06 May 2024 02:04 IST

బలపంలో గిడ్డి ఈశ్వరి ప్రచారం, కూటమి నాయకులు

చింతపల్లి, న్యూస్‌టుడే: మీకు ఏ కష్టమొచ్చినా అండగా నేనుంటా.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. దీనికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటుతోనే వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. చింతపల్లి మండలంలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత బలపం పంచాయతీలో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోరుకొండ వారపుసంతలో కలియతిరిగారు. కుడుముల గ్రామంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఈశ్వరికి అక్కడి గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. మంగళ హారతులతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, గిరిజనులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు. సంక్షేమం మాటున జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని సంక్షోభంలో ముంచేశారని విమర్శించారు. బటన్‌ నొక్కి ఒక చేత్తో సాయం అందిస్తున్నట్లు నటించి ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. రహదారులు, సాగు, తాగునీరు వంటి అనేక రంగాలను పూర్తిగా విస్మరించారన్నారు. బలపం పంచాయతీలోని అన్ని గ్రామాలకు రహదారుల అనుసంధానం చేసి డోలీమోతల నివారణకు చర్యలు తీసుకుంటానని ఈశ్వరి హామీ ఇచ్చారు. తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, పాండురంగస్వామి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని