logo

నాలుగు వేల మందికి ఒకే బూత్‌

స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ను వేసేందుకు అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Published : 07 May 2024 06:53 IST

ఓటేసేందుకు ఉద్యోగుల అవస్థలు

రంపచోడవరంలో పోస్టల్‌ బ్యాలెట్‌కు ఉద్యోగుల క్యూ

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ను వేసేందుకు అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నియోజకవర్గంలోని 11 మండలాల నుంచి 4,658 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంతమందికి ఒకే బూత్‌ను ఏర్పాటు చేయడంతో విలీన మండలాలకు చెందిన వారంతా సోమవారం రావడంతో పెద్దఎత్తున క్యూలో నిల్చుని ఇబ్బందులు పడ్డారు. చింతూరులో నాలుగు మండలాలకు మరో సెంటర్‌ను ఏర్పాటు చేసి పోస్టల్‌ బ్యాలెట్‌ను వేసేందుకు అవకాశం కల్పించి ఉంటే ఇబ్బందులు తప్పేవని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని