logo

నీలాద్రి గుమ్మం నుంచే నిజరూప దర్శనం

సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున వెల్లడించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌తో కలిసి ఉత్సవానికి చేసిన ఏర్పాట్లను వివరించారు.

Published : 09 May 2024 02:17 IST

చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు

విశాఖపట్నం,  న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున వెల్లడించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌తో కలిసి ఉత్సవానికి చేసిన ఏర్పాట్లను వివరించారు. నిజరూప దర్శనం రోజున అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు. రూ.300, రూ.వెయ్యి, రూ.1500 టికెట్లు కొనుగోలు చేసిన వారికి నీలాద్రి గుమ్మం నుంచే దర్శనాలను కల్పిస్తామని తెలిపారు. తెల్లవారుజాము 3.30 గంటల నుంచి 4.30గంటల సమయంలో అనువంశిక ధర్మకర్తల కుటుంబసభ్యులు, న్యాయ, దేవాదాయశాఖ నుంచి పట్టువస్త్రాలు సమర్పించే వారికి మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పిస్తామన్నారు. సాయంత్రం 3 నుంచి 4గంటల సమయంలో సేవకులు, 4 నుంచి 5గంటల మధ్య విభిన్న ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. దర్శనాల కోసం 6 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  

తెల్లవారుజాము నుంచే దర్శనాలు ప్రారంభం

ఈనెల 10వ తేదీ తెల్లవారు జామున 3.30గంటల నుంచే రూ.1000, రూ.300 టికెట్లు, ఉచిత దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సుమారు 1.50లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 29,500 మంది భక్తులకు నీడనిచ్చేలా షామియానాలు వేశామన్నారు. పదిచోట్ల టికెట్ల స్కానర్లు ఏర్పాటు చేశామన్నారు. నిష్క్రమణ ద్వారం వద్ద రివర్స్‌ ఎంట్రీ లేకుండా చూస్తామన్నారు. 160 ప్రదేశాల్లో తాగునీటి శిబిరాలు, 250 చోట్ల టాయిలెట్లు, 60 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 20వేల టికెట్లను అందుబాటులో ఉంచగా వీటిలో రూ.1500 టికెట్లు 5 వేల వరకు ఉన్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని