logo

జగన్‌ జమానాలో ప్రయాణికుల హైరానా

రోడ్లు బాగు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. సుదూర ప్రాంతాలకు కాలం చెల్లిన బస్సులు తిప్పుతుండటంతో గుంతల రోడ్లలో అవి ఆగిపోతున్నాయి.

Published : 09 May 2024 02:31 IST

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: రోడ్లు బాగు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. సుదూర ప్రాంతాలకు కాలం చెల్లిన బస్సులు తిప్పుతుండటంతో గుంతల రోడ్లలో అవి ఆగిపోతున్నాయి. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు బుధవారం రెండు చోట్ల ఆగిపోయింది. లోతుగెడ్డ కూడలి వద్ద ఆగిపోవడంతో డ్రైవర్‌ బాగు చేసుకుని ముందుకు సాగారు. గూడెంకొత్తవీధి వచ్చే మార్గంలో గోతులు అధికంగా ఉండటంతో గేరు రాడ్డు పనిచేయలేదు. ఆర్వీ నగర్‌ నుంచి గూడెంకొత్తవీధి మధ్యలో ఏకంగా గేరు రాడ్డు విరిగింది. దీంతో చేసేదేమీ లేక జీకేవీధిలో బస్సును ఆపేశారు. ఇందులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో సగం మంది భద్రాచలంలో జరిగే పరీక్షకు వెళుతున్నారు. బస్సు ఆగిపోవడంతో వారంతా నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు సరిగ్గా లేక, కాలం చెల్లిన బస్సులు తిప్పుతుండటంతో ఈ పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులే విశాఖపట్నం డీఎంకు ఫోన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పటికప్పుడు నర్సీపట్నం నుంచి మరో బస్సు పంపించారు. అందులో ప్రయాణికులను భద్రాచలం పంపించారు.


పరీక్షకు హాజరవ్వలేకపోతున్నాం

- శివ, ప్రయాణికుడు

మాది నర్సీపట్నం. భద్రాచలంలో జరిగే పరీక్షకు వెళుతున్నాను. మూడేళ్ల తరువాత ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాను. రోడ్లు సరిగా లేవు. బస్సు రెండు చోట్ల ఆగిపోయింది. పరీక్షకు హాజరవ్వలేకపోతున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని