logo

వైకాపా దాడులు మితిమీరాయి..

రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపా నాయకుల దాడులు మితిమీరాయని, వీరిపై చర్యలు తీసుకుని ప్రశాంతవాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చూడాలని అరకు ఎంపీ ఎన్డీయే అభ్యర్థి కొత్తపల్లి గీత పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి నిషాంత్‌కుమార్‌ను కోరారు.

Published : 09 May 2024 02:39 IST

ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపా నాయకుల దాడులు మితిమీరాయని, వీరిపై చర్యలు తీసుకుని ప్రశాంతవాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చూడాలని అరకు ఎంపీ ఎన్డీయే అభ్యర్థి కొత్తపల్లి గీత పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి నిషాంత్‌కుమార్‌ను కోరారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులు, రాజకీయ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్షించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి రంపచోడవరం అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌కుమార్‌తోపాటు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, వైకాపా, సీపీఎం నాయకులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సమస్యలుంటే చెప్పాలని పార్లమెంట్‌ ఆర్వో అడిగారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు రోజు రోజుకు అధికమవుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని గీత కోరారు. ఓటమి భయంతోనే ఇటువంటి చర్యలకు పూనుకొంటున్నారని గీత అన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ఠమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్షలో వైకాపా నాయకులు కె.బాలకృష్ణ, న్యూడెమెక్రసీ పార్టీ తరఫున బాలు అక్కిస తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని