logo

సార్టెక్సు రకాల విత్తనాలు ఏవీ?

ఖరీఫ్‌ సాగు ప్రారంభం అయింది. ఎన్టీఆర్‌ జిల్లాలో వరితో సమానంగా మెట్టపంటలుగా పత్తి, అపరాలు సాగు చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ ఎడమకాలువ ద్వారా ఖరీఫ వరి సాగు చేస్తున్నారు. బోర్లు, బావుల కింద, చెరువుల కింద వరి సాగు అవుతోంది. ఈఏడాది ఇప్పటికి రెండు సార్లు వ్యవసాయ సలహా కమిటీ సమావేశం జరిగింది. అయినా విత్తనాలు మాత్రం ఆర్‌బీకేలలో అందుబాటులో లేవు. రైతులు ప్రైవేటు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. తొలకరి ప్రారంభం కావడం వర్షాలు కురవడంతో పత్తిచేలు దుక్కులు ప్రారంభించారు. పత్తి గింజల కోసం తిరుగుతున్నారు. నకిలీ పత్తి విత్తనాలు, బీటీ పత్తి విత్తనాలు రైతులు మోసపోతున్నారు.

Published : 29 Jun 2022 04:51 IST

ప్రైవేటు వ్యాపారులే దిక్కు!

ఎరువులు అందుబాటులో లేవు

ఈనాడు, అమరావతి

ఖరీఫ్‌ సాగు ప్రారంభం అయింది. ఎన్టీఆర్‌ జిల్లాలో వరితో సమానంగా మెట్టపంటలుగా పత్తి, అపరాలు సాగు చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ ఎడమకాలువ ద్వారా ఖరీఫ వరి సాగు చేస్తున్నారు. బోర్లు, బావుల కింద, చెరువుల కింద వరి సాగు అవుతోంది. ఈఏడాది ఇప్పటికి రెండు సార్లు వ్యవసాయ సలహా కమిటీ సమావేశం జరిగింది. అయినా విత్తనాలు మాత్రం ఆర్‌బీకేలలో అందుబాటులో లేవు. రైతులు ప్రైవేటు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. తొలకరి ప్రారంభం కావడం వర్షాలు కురవడంతో పత్తిచేలు దుక్కులు ప్రారంభించారు. పత్తి గింజల కోసం తిరుగుతున్నారు. నకిలీ పత్తి విత్తనాలు, బీటీ పత్తి విత్తనాలు రైతులు మోసపోతున్నారు. ప్రతి ఏడాది నకిలీ పత్తివిత్తనాలను గ్రామాలకు తిరిగి కొంతమంది వ్యాపారులు అంటగడుతున్నారు. ప్రభుత్వం ఎరువులు విత్తనాలు ఆర్‌బీకేల ద్వారా సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ ఆర్‌బీలలో ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. వరిలో బీపీటీలతో పాటు ఎంటీయూ రకాలను రైతులు సాగు చేస్తున్నారు. ఎంటీయూలో 1061 మినహా ఇతర రకాల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఇవి సాగు చేయవద్దని సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు రకాల విత్తనాల సమీకరణలో అన్నదాతలు ఉన్నారు. చాలా వరకు రైతులు వరి విత్తనాలు స్వయంగానే సమకూర్చుకుంటారు. కానీ వ్యవసాయ పరిశోధనా క్షేత్రాల ద్వారా వచ్చిన వంగడాలు ఎక్కువ దిగుబడి, తక్కువ చీడలు ఉంటాయని భావించి విత్తనాల కోసం తిరుగుతున్నారు. ప్రస్తుతం కేవలం 4వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నాన్‌సార్టెక్స్‌ రకాలను సాగు చేయవద్దని అధికారులే సూచిస్తున్నారు. ఈ రకాలు నూక, మచ్చ, పాడైన గింజలు ఉండటం, సరిగా ఉడకకపోవడం లాంటి కారణాలు చెబుతున్నారు. కేవలం ఉప్పుడు బియ్యం కోసం మాత్రమే వినియోగిస్తారు. ప్రస్తుతం బీపీటీ, ఎంటీయూ 1061 రకాలు మా~రత్రే ఉన్నాయి. ఇవి కేజీ రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. కొంతమంది రైతులు ప్రైవేటుగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. పత్తి విత్తనాలు, మిరప విత్తనాలు ఇంకా ఆర్‌బీకేలలో లేవు. ఎరువులు మొత్తం 1.04లక్షల టన్నులకు కేవలం 13000 టన్నులు మాత్రమే గోదాముల్లో ఉంది. పత్తి, మిరప విత్తనాలు ఆర్‌బీకేలలో ప్రీమియం రకాలు లభ్యమవుతాయని అధికారులు చెబుతున్నా అందుబాటులో రాలేదు.

 

కృష్ణా జిల్లాలో..

కృష్ణా జిల్లాలో ప్రధానంగా డెల్టా కింద వరి సాగు చేస్తారు. చెరుకు, పసుపు, ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ ఖరీఫ్‌లో 1,64,856 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా. ఈనెల 10నే సాగునీరు విడుదల చేశారు. సార్టెక్సు రకాలైన బీపీటీ5204, ఎంటీయూ 1061 రకాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈవిత్తనాలు 52వేల క్విటాళ్లు అవసరం కాగా కృష్ణా జిల్లాలో కేవలం 6,690 కింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చెరకు 10,212 ఎకరాలు, పసుపు 1,884 ఎకరాలు సాగువిస్తీర్ణం విత్తనాలు రైతులే సమకూర్చుకోనున్నారు. ఈ విత్తనాలు ప్రభుత్వం సరఫరా లేదు. ఆర్‌బీకేలలో కేవలం 5వేల క్వింటాళ్ల ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని