logo

ఇదేనా జగనన్న స్వచ్ఛ సంకల్పం..!?

జగనన్న స్వచ్ఛ సంకల్ప పక్షోత్సవాలంటూ అధికార ప్రజాప్రతినిధులు, అధికారులు ఊదరగొట్టారు. అవగాహన పేరుతో ఫొటోలకు పోజులిచ్చి మమ అనిపించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి పట్టణంలోని పరిస్థితి దానికి నిదర్శనంగా నిలుస్తోంది. కొన్ని నెలలుగా కాల్వల్లోని పూడిక

Published : 24 Sep 2022 05:04 IST

జగనన్న స్వచ్ఛ సంకల్ప పక్షోత్సవాలంటూ అధికార ప్రజాప్రతినిధులు, అధికారులు ఊదరగొట్టారు. అవగాహన పేరుతో ఫొటోలకు పోజులిచ్చి మమ అనిపించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి పట్టణంలోని పరిస్థితి దానికి నిదర్శనంగా నిలుస్తోంది. కొన్ని నెలలుగా కాల్వల్లోని పూడిక తొలగించకపోవడంతో మురుగు నీరు పారుదల లేక పసర్లు కట్టి పేరుకుపోయింది. తీవ్రమైన దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు మురుగు కాల్వలన్నీ దోమల కార్ఖనాలుగా మారాయి.

- న్యూస్‌టుడే, మోపిదేవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని