logo

కొండలమ్మకు స్వర్ణాభరణాలు

వేమవరంలోని కొండలమ్మతల్లి దేవస్థానానికి దాతలు బంగారు ఆభరణాలు అందజేశారు. పెడనకు చెందిన చందన నారాయణరావు-అనూరాధ దంపతులు.

Published : 27 Jan 2023 03:54 IST

అర్చకులకు బంగారు మంగళ సూత్రాలు అందజేస్తున్న దాతలు

వేమవరం (గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: వేమవరంలోని కొండలమ్మతల్లి దేవస్థానానికి దాతలు బంగారు ఆభరణాలు అందజేశారు. పెడనకు చెందిన చందన నారాయణరావు-అనూరాధ దంపతులు రూ.1.5 లక్షల విలువైన 29 గ్రాములతో అమ్మవారికి చేయించిన బంగారు మంగళసూత్రాలు, నానుతాడును ఆలయ ప్రధానార్చకుడు రుద్రపాక శివసంతోషశర్మకు గురువారం అందజేశారు. సంప్రోక్షణల తర్వాత అమ్మవారికి దాన్ని అలంకరించారు. పెడన మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బొడ్డు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు