logo

స్ఫూర్తిదాయకంగా విద్యా సంస్కరణలు

విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంస్కరణలు స్ఫూర్తిదాయకమని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 05:39 IST

బృందంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంస్కరణలు స్ఫూర్తిదాయకమని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యారంగంలో పనిచేస్తున్న సంస్థలు, ఐఏఎస్‌ అధికారులు, ప్రముఖ విద్యావేత్తలు, నిపుణుల బృందం శనివారం కృష్ణాజిల్లాలోని కోలవెన్ను మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, పునాదిపాడు, ఈడుపుగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలు, ఎన్టీఆర్‌ జిల్లాలోని పటమట జడ్పీ బాలికోన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ బృందంలో రత్‌ఫోర్బ్‌, వివేక్‌ రాఘవన్‌, మురుగున్‌ వాసుదేవన్‌, మినాల్‌ కరణ్వాల్‌, ఆకాంక్ష గులాటి, ప్రాచీ వినాస్‌, తరుణ్‌ చెరుకూరి, స్నేహ మీనన్‌ ఉన్నారు. అనంతరం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యనిస్తూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ వారికి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని