logo

గాలి, వాన బీభత్సం

తుపాను ప్రభావంతో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, వీచిన ఈదురుగాలులకు విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.

Published : 21 Mar 2023 04:48 IST

గుడ్లవల్లేరులో కొత్త విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేయిస్తున్న ఏఈఈ సుబ్బారెడ్డి

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, వీచిన ఈదురుగాలులకు విద్యుత్తు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో ఈదురు గాలుల బీభత్సానికి విద్యుత్తు శాఖకు అపార నష్టం వాటిల్లింది. సరఫరా నిలిచిపోయి వినియోగదారులు అవస్థలు పడ్డారు. మండలంలో 35 విద్యుత్తు స్తంభాలు నేలకొరగగా, అత్యధికంగా 25 వరకు గుడ్లవల్లేరులోనే కావడం గమనార్హం. గాలులకు చెట్ల కొమ్మలు, చెట్లు స్తంభాలపై పడటంతో అవి కూడా కూలిపోయాయి. తీగలు తెగిపోయాయి. ఆదివారం ఉదయం నుంచి సీపీడీసీఎల్‌ కౌతవరం ఏఈఈ సుబ్బారెడ్డి, సిబ్బంది తొలుత తీగలపై పడిన చెట్లను తొలగించి సరఫరాను పునరుద్ధరించే పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. అలాగే స్తంభాలను కొత్తవి ఏర్పాటు చేయించారు. దీంతో మండలంలోని ఇతర గ్రామాల్లో ఆదివారం సాయంత్రానికి సరఫరా పునురుద్ధరించారు. గుడ్లవల్లేరులోని ఎన్టీఆర్‌ కాలనీ, ఇందిరాకాలనీ, సింగలూరు కాల్వగట్టు, జేమ్స్‌పేట తదితర గ్రామాలకు దాదాపు 40 గంటల తర్వాత సోమవారం సాయంత్రానికి సరఫరా ఇచ్చారు. 3 నియంత్రికలు పాడైపోవడంతో సమీపంలోనివాటితో అనుసంధానించారు. దీంతో లోడు పెరిగి సరఫరాలో అవాంతరాలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని